English | Telugu
కళ్యాణి రుణం తీర్చుకున్న నందినీ రెడ్డి
Updated : Feb 8, 2011
ఈ రోజుల్లో చేసిన మేలు గుర్తుంచుకునే వారు ఎవరూ లేరు.కానీ "అలా మొదలైంది" చిత్రం ద్వారా దర్శకురాలైన నందినీ రెడ్డి వంటి వారు ఎక్కడో నూటికో కోటికో ఉంటారు. అంటే ఒక సంగీత దర్శకుడై ఉండీ, తన స్నేహితుడైన "అలా మొదలైంది" నిర్మాత దామోదర్ కి చెప్పి నందినీరెడ్డి దర్శకురాలయ్యేందుకు పూర్తిగా సహకరించి, చక్కని సంగీతాన్నందించి ఆ చిత్రం విజయం సాధించటంలో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన కళ్యాణి మాలిక్ ని తన గురువు కృష్ణ వంశీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించబోయే "మొగుడు" సినిమాకి సంగీత దర్శకుడిగా రికమెండ్ చేసి కళ్యాణి మాలిక్ తనకు చేసిన మేలుకు నందినీ రెడ్డి ఆ విధంగా తన రుణం తీర్చుకుంది.