English | Telugu
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ అతనే.. హీరోయిన్ గా శ్రీలీల!
Updated : Oct 11, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ సైతం ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు కానీ అది ఎప్పుడనే దానిపై క్లారిటీ లేదు. ఇటీవల 'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చారు. అయితే తెర వెనుక మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతుందని.. డైరెక్టర్, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది.
తనతో 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడికే మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బాలకృష్ణ అప్పగించారట. 'భగవంత్ కేసరి' దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పట్ల బాలయ్య ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయనకు అనిల్ వర్క్ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించారట. అంతేకాదు ఇప్పటికే హీరోయిన్ ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. 'భగవంత్ కేసరి'లో బాలయ్య కూతురిగా నటించిన శ్రీలీలనే మోక్షజ్ఞ మొదటి హీరోయిన్ అట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావొచ్చు అంటున్నారు.