English | Telugu
నందమూరి మోక్షజ్ఞ సరసన శ్రీలీల!
Updated : Jul 6, 2024
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన రీసెంట్ పిక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని, మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న లాంచ్ చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది.
'భగవంత కేసరి' సినిమాలో బాలకృష్ణకు కూతురు తరహా లాంటి పాత్రలో శ్రీలీల అలరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను లాక్ చేసినట్లు సమాచారం.