English | Telugu

'ఇండియన్ 2'లో రామ్ చరణ్..!

రాజమౌళి (Rajamouli) డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో కలిసి గ్లోబల్ సక్సెస్ అందుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan). ఆ తర్వాత కొద్దిరోజులకే తన తండ్రి చిరంజీవి (Chiranjeevi)తో కలిసి స్క్రీన్ చేసుకున్న 'ఆచార్య' విడుదలై నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి 'ఆర్ఆర్ఆర్'తో వచ్చిన ఆనందాన్ని 'ఆచార్య' తగ్గించిందనే చెప్పాలి. అందుకే రామ్ చరణ్ బాక్సాఫీస్ సందడి కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer) బాగా ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైంలో.. 'గేమ్ ఛేంజర్' కంటే ముందే రామ్ చరణ్ బిగ్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

'గేమ్ ఛేంజర్' సినిమా ఆలస్యమవడానికి కారణం 'ఇండియన్-2' (Indian 2) అనే విషయం తెలిసిందే. నిజానికి 'ఇండియన్-2'నే డైరెక్టర్ శంకర్ ముందు స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని వివాదాల కారణంగా ప్రొడక్షన్ కి బ్రేక్ పడింది. దీంతో రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ని మొదలుపెట్టాడు శంకర్. అయితే 'గేమ్ ఛేంజర్' కొంతభాగం షూట్ అయ్యాక.. అనుకోకుండా వివాదాలు సద్దుమణగడంతో శంకర్ మళ్ళీ 'ఇండియన్-2' తో బిజీ కావాల్సి వచ్చింది. ఆ ప్రభావం 'గేమ్ ఛేంజర్'పై పడి బాగా ఆలస్యమైంది. ఓ రకంగా తమ హీరో సినిమా లేట్ అవడానికి కారణం కావడంతో.. 'ఇండియన్-2'పై చరణ్ అభిమానులు ముందు నుంచి కాస్త గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అదే 'ఇండియన్-2'.. చరణ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయనుందని తెలుస్తోంది. 'ఇండియన్-2'లో రామ్ చరణ్ అతిథి పాత్రలో మెరవనున్నాడట. కనిపించేది కాసేపే అయినప్పటికీ, అది ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా ఉంటుందట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. జూలై 12న 'ఇండియన్-2' విడుదల కానుంది. ఆరోజు చరణ్ గెస్ట్ రోల్ పై క్లారిటీ రానుంది.