English | Telugu
'హాయ్ నాన్న' దర్శకుడితో ఎన్టీఆర్.. ఊహించని కాంబో!
Updated : Jul 7, 2024
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' (Devara) సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' (War 2)లో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇక తాజాగా ఊహించని విధంగా ఒక యువ దర్శకుడితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన తర్వాత కూడా కొందరు హీరోలు.. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ (Prabhas).. సుజీత్ తో 'సాహో', రాధాకృష్ణతో 'రాధేశ్యామ్' చేశాడు. అలాగే రామ్ చరణ్ (Ram Charan) కూడా ఒక్క సినిమా అనుభవమున్న 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో తన నెక్స్ట్ మూవీని చేస్తున్నాడు. ఇప్పుడదే బాటలో ఎన్టీఆర్ కూడా పయనించనున్నట్లు సమాచారం.
నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే మెప్పించాడు శౌర్యవ్ (Shouryuv). తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ.. ఓటీటీ ద్వారా ఇతర భాషల ప్రేక్షకులను కూడా మెప్పించి, దర్శకుడిగా శౌర్యవ్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి రెండో సినిమాకే ఏకంగా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని టాక్. శౌర్యవ్ చెప్పిన కథ నచ్చడంతో.. అతనితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 'హాయ్ నాన్న' చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని వినికిడి.