English | Telugu
అల్లుడితో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ
Updated : Nov 30, 2011
అల్లుడు అంటే ఇక్కడ నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి భర్త నారా లోకేష్ మాత్రం కాదు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడు వర్థమానహీరో నారా రోహిత్. నారా రోహిత్ గతంలో "బాణం" చిత్రంలోనూ, ప్రస్తుతం "సోలో" చిత్రంలోనూ నటించాడు.తొలి చిత్రంలో బాగా నటించాడన్న పేరు సంపాదించుకున్నా అది హిట్టవ్వ లేదు. "సోలో" చిత్రం మాత్రం కాస్తో కూస్తో ప్రేక్షకాదరణకు నోచుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రాబోయే "ఉగ్రనరసింహం" చిత్రంలో నారా రోహిత్ కూడా నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.
అన్న కొడుకు జూనియర్ యన్ టి ఆర్ ని కాదని నారా రోహిత్ ని తన చిత్రంలో నటింపజేయటానికి బలమైన కారణాలే ఉన్నాయట. పెళ్ళి అయిన దగ్గరనుండీ యన్ టి ఆర్ చంద్రబాబుకు దూరమవుతూ వచ్చాడనీ, అతని స్థానాన్ని నారా రోహిత్ కు ఇస్తే బాగుంటుందనీ చంద్రబాబు ఈ ఎత్తు వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. దానికి తగ్గట్టే నారా రోహిత్ కూడా తన "సోలో" చిత్రం ప్రమోషంలో భాగంగా అన్ని ఛానల్స్ కూ ఇంటర్వ్యూ ఇచ్చి యన్ టి ఆర్ మామ తాలూకు ఛానల్ ను మాత్రం దురంగా ఉంచటానికిదే కారణమని తెలియవచ్చింది.