English | Telugu

పవన్ "పంజా" పై కుట్ర

అర్కా మీడియా పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్‍ గా, విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "పంజా". ఈ "పంజా" చిత్రం డిసెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కాబోతూంది. అయితే ఈ "పంజా" చిత్రం మీద కుట్ర ఏమిటయ్యా అంటే ఈక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు హైదరాబాద్ లోనో లేక మన రాష్ట్రంలోనో దాదాపు 100 థియేటర్లను 50 రోజుల పాటు లీజుకు ముందుగా బుక్ చేసుకున్నారట. ఆ విధంగా "పంజా" విడుదలయ్యే థియేటర్ల సమఖ్యను ఓ వంద థియేటర్లకు తగ్గించే కుట్ర జరుగుతూందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. మరి ఇదెంతవరకూ నిజమో కానీ ఈ విధంగా చేయటం మాత్రం సరి అయ్యింది కాదని తెలుగువన్ అభిప్రాయపడుతూంది.