English | Telugu
యన్ టి ఆర్ పై పవన్ కళ్యాణ్ దాడి
Updated : Dec 5, 2011
యంగ్ టైగర్ యన్ టి ఆర్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాడి చేశాడంటే భౌతికంగా అని కాదు. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో అన్న కొన్నిమాటలు ఆ విధంగా ఆలోచించేలా చేశాయి. నిజానికి పవన్ మనసులో ఆ ఉద్దేశం లేకపోవచ్చు. యాదృచ్చికంగానే పవన్ అలా అని ఉండొచ్చు. కానీ ఆ మాటలు యన్ టి ఆర్ అభిమానులను గాయపరిచాయన్నది మాత్రం వాస్తవం. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడయ్యా...అంటే "నేనింతవరకూ ఏ డైరెక్టర్ నీ నాతో సినిమా చేయమని అడగలేదు" అని అన్నాడు.
అంటే యన్ టి ఆర్ "ఊసరవెల్లి" ఆడియో ఫంక్షన్ లో "నాతో ఎప్పుడు సినిమా చేస్తాడో రాజమౌళిని అడగండి" అని తన అభిమానులను ఉద్దేశించి అన్న మాటలకు కౌంటర్ గా పవన్ ఈ మాటలన్నాడని యన్ టి ఆర్ అభిమానుల అభిప్రాయం. నిజానికి పవన్ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉండకపోవచ్చు. కానీ "ఏదో అనుకుంటే ఏదో జరిగిందే" అన్నట్టు పవన్ అన్న మాటలకు ఇలా యన్ టి ఆర్ అభిమానులు ఫీలవటం అనవసరమేమో....!