English | Telugu
కుర్రభామతో నాగ్ రొమాన్స్.. వామ్మో 37 ఏళ్ళు తేడా ఉందిగా!
Updated : Sep 7, 2023
తెలుగునాట రొమాంటిక్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు 'మన్మథుడు' నాగార్జున. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా పలకరించని ఈ సీనియర్ స్టార్.. ప్రస్తుతం 'నా సామి రంగ'లో నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగేస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగ్ కి అచ్చొచ్చిన స్వరవాణి కీరవాణి.. ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, 'నా సామి రంగ'లో నాగ్ కి జోడీగా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ మద్య ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించనుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్.. 'నా సామి రంగ'లో హీరోయిన్ గా ఎంటర్టైన్ చేయనుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. తన కంటే 37 ఏళ్ళు చిన్నదైన కథానాయికతో నాగ్ సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నట్టే. నాగ్ ప్రస్తుత వయస్సు 64 కాగా.. ఆషికా ఏజ్ జస్ట్ 27. మరి.. నాగ్, ఆషికా రొమాన్స్.. సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.