English | Telugu
చిరుతో మృణాళ్.. వర్కవుట్ అవుతుందా?
Updated : Sep 7, 2023
'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఉత్తరాది భామ మృణాళ్ ఠాకూర్. ఇందులో సీతామహాలక్ష్మిగా, ప్రిన్సెస్ నూర్జాహాన్ గా తన అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ చేతిలో.. రెండు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి నేచురల్ స్టార్ నానికి జంటగా నటిస్తున్న 'హాయ్.. నాన్న' కాగా.. మరొకటి యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో పరశురామ్ తెరకెక్కిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' (వర్కింగ్ టైటిల్). క్రిస్మస్ సీజన్ లో 'హాయ్ నాన్న' రిలీజ్ కానుండగా.. 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతికి వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, తాజాగా మృణాళ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ.. నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. కాగా, ఈ చిత్రంలో అభినయానికి ఆస్కారమున్న కథానాయిక పాత్ర కోసం మృణాళ్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. మృణాళ్ కూడా మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని ఫిల్మ్ నగర్ బజ్. త్వరలోనే.. మెగా 157లో మృణాళ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. చిరు, మృణాళ్ జోడీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.