English | Telugu

అతని బయోపిక్‌ చేసేందుకు రామ్‌చరణ్‌ రెడీ అవుతున్నాడా!?

ప్రముఖ వ్యక్తుల జీవితాలనే కథలుగా మలిచి సినిమాలు తీస్తున్న టైమ్‌ ఇది. బయోపిక్‌ పేరుతో తెరకెక్కుతున్న ఆయా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతుండడంతో మరికొన్ని బయోపిక్స్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎం.ఎస్‌.ధోని, సచిన్‌, 83.. ఇప్పటివరకు వచ్చిన క్రికెటర్ల బయోపిక్స్‌. తాజాగా ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ ‘800’ పేరుతో రూపొందింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల సచిన్‌ టెండూల్కర్‌ విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. 
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి బయోపిక్‌ రాబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటిస్తాడన్నది మరో స్పెషల్‌ న్యూస్‌. ఇది కేవలం వినిపిస్తున్న వార్త మాత్రమే. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఇక విరాట్‌ కోహ్లి  బయోపిక్‌కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.