English | Telugu

వైజాగ్ లో నాగార్జున "రాజన్న" చూస్తారు

వైజాగ్ లో నాగార్జున "రాజన్న" చూస్తారు అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రాజన్నగా నటిస్తూ నిర్మించిన చిత్రం "రాజన్న".

ఈ "రాజన్న" చిత్రాన్ని హీరో కమ్ నిర్మాత అయిన నాగార్జున వైజాగ్ (విశాఖపట్టణం) లోని ఐనాక్స్ థియేటర్లో డిసెంబర్ 22 వ తేదీన చూస్తారని తెలిసింది. నాగార్జున "రాజన్న" చిత్రం మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ "రాజన్న" రెగ్యులర్ పేట్రన్ నుండి బయటకు వచ్చి నిర్మించిన చిత్రమనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా ఈ "రాజన్న" చిత్రాన్ని తీర్చిదిద్దామనీ ఆయన అన్నారు.