English | Telugu
నాగచైతన్య "గౌరవం"లో నాగార్జున
Updated : Dec 17, 2011
నాగచైతన్య "గౌరవం"లో నాగార్జున కూడా నటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన "దడ", బెజవాడ" చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని "గగనం" దర్శకుడు కె.రాధామోహన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించటానికి నాగచైతన్య అంగీకరించాడు. ఈ "గౌరవం" చిత్రం ఒక చక్కని ప్రేమకథతో తీసే సినిమానే అయినా ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులకు అవసరమైన అన్ని కమర్షియల్ హంగులూ ఉంటాయట. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా ఈ "గౌరవం" చిత్రంలో నటించనున్నారట. రాధా మోహన్ "గగనం" చిత్రంలో ఒక పాట కూడా లేకుండా ఎంత చక్కగా తీశాడో మనందరికీ తెలిసిందే. అలాగే తండ్రీ కొడుకుమైన నాగచైతన్య, నాగార్జున కలసి నటించబోయే ఈ "గౌరవం" చిత్రం కూడా అలాగే ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాడని ఆశిద్దాం.