English | Telugu
ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలో నాగార్జున!
Updated : Jul 25, 2023
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గతేడాది నవంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రంగా రూపొందనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ప్రయోగాలు, ప్రత్యేక పాత్రలు చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. గతేడాది విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర'లోనూ ఆయన కీలక పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలో నటించడానికి ఆయన ఓకే చెప్పారని వినికిడి. ఇది సినిమాకి చాలా కీలక పాత్ర అని, అందుకే సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులకు పరిచయమున్న స్టార్ నాగార్జునను మూవీ టీం సంప్రదించిందట. మూడు నుంచి నాలుగు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ లో నాగార్జున పాల్గొనబోతున్నట్లు సమాచారం.