English | Telugu
త్వరలో నాగ చైతన్య రెండో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
Updated : Feb 12, 2024
అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ సమంతను ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్న చైతన్య.. మనస్పర్థల కారణంగా నాలుగేళ్లకే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి జీవితంతో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య 'తండేల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే త్వరలోనే ఆయన రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, మొదటి వివాహం నిలబడకపోవడంతో.. ఈసారి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని చైతన్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. చైతన్య తన రెండో పెళ్లి బాధ్యతను పూర్తిగా తన తండ్రి నాగార్జునకే వదిలేశాడట. నాగార్జున సైతం ఎంతో ఆలోచించి తన కుమారుడి కోసం దగ్గరి బంధువుల అమ్మాయినే ఎంపిక చేశాడట. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని, త్వరలోనే ముహుర్తాలు పెట్టుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
కాగా సమంతతో విడాకుల తర్వాత మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు బంధువుల అమ్మాయితో చైతన్య రెండో పెళ్లి అనే వార్త ఆసక్తికరంగా మారింది.