English | Telugu

‘పుష్ప2’ రిలీజ్‌పై వినిపిస్తున్న కొత్త వార్త.. ఆ విషయంలో నిర్మాతల టెన్షన్‌!

ఈమధ్యకాలంలో మేకర్స్‌ చెప్పిన డేట్‌కి ఏ భారీ సినిమా కూడా రిలీజ్‌ అవ్వడం లేదు. ప్రతి సినిమా వాయిదా పడుతూ చివరికి ఏదో ఒక డేట్‌కి రిలీజ్‌ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప2’ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ సినిమాను ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నారనే వార్త ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు నటుడు జగదీష్‌ వల్ల షూటింగ్‌ డిలే అవుతోందని, అందుకే రిలీజ్‌ని వాయిదా వేస్తారని చెప్పుకున్నారు. అయితే ఆ కారణంతోనే సినిమా రిలీజ్‌ డేట్‌ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. 

మరో పక్క దర్శకుడు సుకుమార్‌పై ఒత్తిడి బాగా పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్‌ 15కే సినిమాను విడుదల చెయ్యాలని నిర్మాతలు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. ముందుగా అనుకున్న డేట్‌కి సినిమాని రిలీజ్‌ చెయ్యలేకపోతే నిర్మాతలకు రూ.200 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఆగస్ట్‌ 15కే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని సుకుమార్‌కు నిర్మాతలు చెప్పారట. ‘పుష్ప2’ తర్వాత ‘పుష్ప3’ కూడా ఉంది కాబట్టి ‘పుష్ప2’లోని కొన్ని సీన్స్‌ను ‘పుష్ప3’ కోసం ఉంచి ఆగస్ట్‌ 15కే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని భావిస్తున్నారని సమచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్‌పై వస్తున్న ఈ వార్తలపై మేకర్స్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.