English | Telugu

రెండో పెళ్ళికి రెడీ అవుతున్న చైతన్య.. వధువు ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు, విడాకులు సర్వసాధారణమైన విషయం. ఒకటికి మించి పెళ్ళిళ్ళు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఒక హీరోగానీ, హీరోయిన్‌గానీ రెండో పెళ్ళి చేసుకుంటున్నారు అనే వార్త వస్తే అందరూ ఎంతో ఆసక్తిగా దాని గురించి చర్చించుకుంటారు. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి బాలీవుడ్‌ మీడియాలో చక్కర్తు కొడుతోంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సింది.
నాగచైతన్య, సమంత కొన్నేళ్ళ క్రితం వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు తప్ప ఎవ్వరూ రెండో వివాహానికి ముందుకు రాలేదు. తాజాగా నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఆమధ్య హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ళతో చైతన్య డేటింగ్‌లో ఉన్నాడని, విదేశాల్లో ఇద్దరూ కలిసి షికార్లు చేస్తున్నారన్న రూమర్స్‌ వినిపించాయి. దానికి తగ్గట్టుగానే వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో కనిపించాయి. అయితే ఈ రూమర్‌లో ఎలాంటి నిజం లేదని శోభిత ఖండిరచింది. చైతన్య మాత్రం స్పందించలేదు. మరోపక్క చైతన్య తండ్రి నాగార్జున తన ఇద్దరు కొడుకుల జీవితాల పట్ల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. చైతన్య పెళ్ళి చేసుకోని విడాకులు తీసుకుంటే, శ్రీయా భూపాల్‌తో అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్‌ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకొని చైతన్యకు రెండో పెళ్ళి చెయ్యాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
ఈసారి సినిమా వాళ్ళు కాకుండా ఒక బిజినెస్‌ మేన్‌ కూతురితో చైతన్య పెళ్ళి ఫిక్స్‌ చేశారని సమాచారం. ప్రేమ పెళ్ళి విఫలం కావడంతో ఈసారి తండ్రి చూసిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని చైతన్య నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ వార్త బాలీవుడ్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. ఇందులో నిజానిజాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.