English | Telugu
కాజల్ కి ఓటేసిన నాగ్.. ఈ సారైనా పూర్తి చేస్తారా!
Updated : Aug 11, 2023
కింగ్ నాగార్జున నుంచి సినిమా వచ్చి ఆల్మోస్ట్ ఏడాది కావస్తోంది. గతేడాది దసరాకి వచ్చిన 'ది ఘోస్ట్' మూవీ.. నాగ్ నుంచి వచ్చిన చివరి చిత్రం. ఈ నేపథ్యంలో.. కింగ్ కొత్త సినిమా కబురు గురించి అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య 'ధమాకా' రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. నాగార్జున ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మలయాళ చిత్రం 'పొరింజు మరియం జోస్' ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నారట నాగ్. ఈ రీమేక్ తో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ అవతారమెత్తనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ.. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా కాజల్ ని ఎంపికచేశారని ఫిల్మ్ నగర్ టాక్. అదే గనుక నిజమైతే.. వీరిద్దరి కాంబోలో ఇదే మొదటి చిత్రమవుతుంది. కాకపోతే.. నాగ్ ప్రీవియస్ మూవీ 'ది ఘోస్ట్' లోనూ మొదట కాజల్ నే నాయికగా సెలెక్ట్ చేశారు. కొంతమేర షూటింగ్ అయ్యాక కొన్ని కారణాల వల్ల కాజల్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చింది. దాంతో.. ఆమె స్థానంలోకి సోనాల్ చౌహాన్ చేరింది. మరి.. ఈ సారైనా నాగ్, కాజల్ కాంబో వర్కవుట్ అవుతుందో లేదంటే వార్తలకే పరిమితమవుతుందో చూడాలి.