English | Telugu
ప్రభాస్ కి 'రాజా డీలక్స్' వద్దు.. 'వింటేజ్ కింగ్' ముద్దు.. !
Updated : Aug 10, 2023
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే సినిమాలే కాదు.. వాటి తాలూకు టైటిల్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి. 'బాహుబలి - ది బిగినింగ్', 'బాహుబలి - ది కంక్లూజన్', 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆది పురుష్'.. ఇలా ఇప్పటివరకు వచ్చిన పాన్ ఇండియా బొమ్మలన్నీ ఈ ప్రకారంగానే వెళ్ళాయి. ఇక రాబోయే 'సలార్', 'కల్కి 2898 ఎడి', 'స్పిరిట్' కూడా ఇదే బాటలో వెళుతున్న చిత్రాలే.
ఇదిలా ఉంటే, వరుస విజయాల దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన 'మాస్టర్' ఫేమ్ మాళవికా మోహనన్ నాయికగా నటిస్తోంది. సంజయ్ దత్, జరీనా వహబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టైటిల్ పట్ల అంతగా ఆసక్తి చూపించకపోవడంతో.. వేరే శీర్షిక కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలోనే.. 'వింటేజ్ కింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. అదే గనుక నిజమైతే.. 'రాజా డీలక్స్' కంటే 'వింటేజ్ కింగ్' అనేదే క్యాచీ గా, క్రేజీగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
త్వరలోనే 'వింటేజ్ కింగ్' టైటిల్ పై క్లారిటీ వస్తుంది. కాగా, 2024 వేసవికి ప్రభాస్, మారుతి కాంబో ఫిల్మ్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశముందంటున్నారు.