English | Telugu
విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నాగ్.. అందుకేనయ్యా నిన్ను కింగ్ అనేది!
Updated : Jan 19, 2024
కొత్త వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంలో కింగ్ అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఆయన ఎందరో దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. విజయ్ పనితనాన్ని మెచ్చిన నాగ్.. ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన సినిమా 'నా సామి రంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఓ వైపు 'హనుమాన్', 'గుంటూరు కారం' సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు 'నా సామి రంగ' కూడా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. నాగార్జున ఖాతాలో మరో సంక్రాంతి హిట్ గా నిలవనుంది. మలయాళ మూవీ 'పొరింజు మరియం జోస్' ఆధారంగా రూపొందిన ఈ సినిమా తక్కువ సమయంలోనే పూర్తయింది. విజయ్ అనుకున్న సమయంలో సినిమాని రూపొందించడమే కాకుండా, మంచి అవుట్ పుట్ అందించాడనే ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక విజయ్ తో వర్క్ తో ఇంప్రెస్ నాగార్జున అతనితో మరో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తరపున విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే అన్నపూర్ణ బ్యానర్ లో విజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటన రానుందని వినికిడి.