English | Telugu
వరుణ్ తేజ్ ఇరగదీస్తాడా?
Updated : Dec 17, 2014
'ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతోన్న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పై బిజినెస్ వర్గాలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంతగా అంటే ఇతని మొదటి సినిమా 'ముకుంద' రిలీజ్ కి ముందే ఇరవై కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. ఇతర ఏ మెగా హీరోల మొదటి సినిమాకి ఇంత బిజినెస్ జరగలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వరుణ్ తేజ్ వీళ్ళ అంచనాల్ని ఏమాత్రం అందుకుంటాడనేది తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే.