English | Telugu

వ‌ర్మా.. వాటీజ్ దిస్స‌మ్మా?

ఫ్లాష్ న్యూసులు తొంద‌ర‌గా చేర‌వేయాలన్న ఆత్రం టీవీ ఛాన‌ల్ల‌ది. స్కోరింగ్ గురించి చూసుకొంటారు గాబ‌ట్టి, వారి ఆత్రాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. బాల‌చంద‌ర్ విష‌యంలో కొన్ని ఛాన‌ళ్లు తొంద‌ర ప‌డ్డాయి. బాల‌చంద‌ర్ క్షేమంగా ఉన్నా.. నో మోర్ అంటూ ఫ్లాష్ న్యూస్‌లు వేసి నాలుక క‌రుచుకొన్నాయి. అయితే రాంగోపాల్ వ‌ర్మ కూడా అలానే తొంద‌ర‌ప‌డ్డాడు. బాల‌చంద‌ర్ ఈజ్ నో మోర్‌.. వెరీ శాడ్ అంటూ ట్వీట్ చేశాడు. ఆన‌క అస‌లు సంగ‌తి తెలుసుకొని నాలుక క‌రుచుకొని ఆ ట్వీట్ తొల‌గించాడు. వ‌ర్మ ట్విట్ ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువ‌. ఇలాంటి సెన్సిటీవ్ న్యూస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కాస్త నిదానంగా పోస్టింగులు చేయాలి. కానీ అదేం ఆత్ర‌మో, టీవీ ఛాన‌ల్ మాదిరి రేటింగ్ కోస‌మో, రీ ట్వీట్‌ల కోస‌మో.. తొంద‌ర‌ప‌డ్డాడు వ‌ర్మ‌. ఆ త‌ర‌వాత ఖుష్‌బూ.. ఇలా తొంద‌ర ప‌డి ట్వీట్లు చేసేవాళ్లంద‌రికీ చివాట్లు పెట్టింది. లెజెండ్రీ వ్య‌క్తి గురించి ఏది ప‌డితే అది ట్వీట్ చేయొద్ద‌ని, ఆయ‌న క్షేమంగానే ఉన్నార‌ని తెలిపింది. పాపం... వ‌ర్మ‌. ఆయ‌న సినిమాలే కాదు, ట్విట్లూ ఫ్లాపే.