English | Telugu

చిరు సాంగ్ తో వస్తున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి కథ సిద్దమవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి. శ్రీనువైట్ల రచయితల బృందం స్క్రీన్‌ప్లేపై వర్క్‌ చేస్తున్నారు. ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'మై నేమ్‌ రాజు’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చిరు కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటైన 'జగదీకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో 'మై నేమ్‌ రాజు’ అంటూ చిరు పాడే పాటని ఈ సినిమాకి టైటిల్ గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. జనవరి చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.