English | Telugu

'దేవర'లో ఐటెం సాంగ్.. బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్!

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'(Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉందని, అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) మెరవనుందని సమాచారం.

గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జనతా గ్యారేజ్'లోని 'పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. ఆ సాంగ్ లో కాజల్ అగర్వాల్ చిందేసింది. ఇప్పుడు 'దేవర'లో అంతకుమించి ఉండేలా ఐటెం సాంగ్ ని ప్లాన్ చేశారట. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటలో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో అలరించనుందట. కాగా పూజ గతంలో 'రంగస్థలం', 'ఎఫ్-3' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో సందడి చేసింది.