English | Telugu

రాఖీ వల్ల మరోసారి వార్తల్లోకి మంచు ఫ్యామిలీ!

సెలబ్రిటీలు చేసే కొన్ని ట్వీట్లు ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలకు దారి తీస్తాయి. అలాంటిదే మంచు ఫ్యామిలీలో జరిగింది. గురువారం రాఖీ పండగ సందర్భంగా మంచు లక్ష్మీ వేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. మనోజ్‌కి రాఖీ కట్టి, అనంతరం ఇలా లంచ్‌కి వచ్చామంటూ వేసిన ట్వీట్‌ వల్ల వారి ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోంది అనే అనుమానాలు వస్తున్నాయి. మంచు విష్ణుని వీళ్ళు పక్కన పెట్టారా అనే ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలు వచ్చాయని, వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వున్న మంచు లక్ష్మీ, మనోజ్‌ ఫోటోల వల్ల నెటిజన్ల కామెంట్స్‌ పెరిగిపోయాయి. ఎప్పుడూ వీరిద్దరే కలిసి కనిపిస్తుంటారు. అంతే కాదు మనోజ్‌ పెళ్ళిని కూడా లక్ష్మీ దగ్గరుండి చూసుకుంది. విష్ణు ఈ విషయంలో అంతగా ఇన్‌వాల్వ్‌ కాలేదు. దీంతో వారి మధ్య విభేదాలు ఉన్నాయని కన్‌ఫర్మ్‌ చేసుకున్నారంతా.  
మనోజ్‌ సన్నిహితుడు సారథి, విష్ణు గొడవకు రావడం, ఆ వీడియోను మనోజ్‌ షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో అది ఎంత వైరల్‌ అయ్యిందో ఎలాంటి వివాదాలకు దారితీసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దాన్ని కవర్‌ చేసేందుకు అది ఓ రియాలిటీ షోలో భాగం మాత్రమేనని విష్ణు చెప్పడం కూడా ట్రోలింగ్‌కి కారణమైంది. అదే ఘటన వల్ల వారి మధ్య గ్యాప్‌ ఎక్కువైందని అందరూ అనుకున్నారు. రాఖీ వ్యవహారం అది నిజమేనని చెబుతున్నట్టుగా ఉంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ విషయంపై నెటిజన్ల మధ్య చర్చలు మొదలయ్యాయి.