English | Telugu

ఎన్టీఆర్ 'దేవర'లో మహేష్ బాబు.. ఇది కదా న్యూస్ అంటే...

ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తే.. అభిమానులకు, ప్రేక్షకులకు మామూలు కిక్ ఉండదు. త్వరలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara) అలాంటి కిక్కే ఇవ్వబోతుందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దేవర చిత్రంలో మహేష్ బాబు (Mahesh Babu) గెస్ట్ రోల్ లో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్, మహేష్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు. అలాగే డైరెక్టర్ కొరటాలతోనూ మహేష్ కి మంచి బాండింగ్ ఉంది. వీరి కలయికలో 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, కొరటాల తో ఉన్న అనుబంధంతోనే.. 'దేవర'లో గెస్ట్ రోల్ అనగానే.. మహేష్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పినట్లు టాక్.

ఎన్టీఆర్, మహేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఎదురుచూసేవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు 'దేవర' రూపంలో వారి కోరిక నెరవేరనుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. నిజమైతే మాత్రం, మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశముంది. దీంతో తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడానికి అంతకాలం ఎదురుచూడాలా అనే నిరాశ మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు దేవర రూపంలో మహేష్ కాసేపు స్క్రీన్ మీద కనిపించినా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు అనడంలో సందేహం లేదు.