English | Telugu
ప్రభాస్ కొత్త సినిమా.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు!
Updated : Dec 5, 2023
పాన్ ఇండియా సినిమా చేసే దర్శకనిర్మాతలు ఆ సినిమాకి పనిచేసే ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ వరకు ఒక రేంజ్‌లో ఉన్నవారినే తీసుకుంటారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎక్కడా తగ్గరు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి అయినా సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేసే వారికే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇప్పుడు ప్రభాస్ సినిమాకి మాత్రం అవి పక్కన పెట్టి ఒక అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. మరోపక్క ‘కల్కి’తోపాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలు వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇప్పట్లో అందేలా లేవు. ఈ సినిమాలు కాక కృష్ణగాడి వీరప్రేమగాధ, సీతారామం వంటి సూపర్‌హిట్ సినిమాలను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ ఫైనల్ అయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవర్ని తీసుకోవాలని అనే దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఫైనల్‌గా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడట. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాధ, పడి పడి లేచే మనసు చిత్రాలకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.
అలాగే ఇటీవల వచ్చిన సీతారామం సినిమాకి కూడా విశాల్ సూపర్‌హిట్ మ్యూజిక్ చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశాల్‌ను ప్రభాస్ కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇది విశాల్ చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. అతని కెరీర్‌లో దాదాపు ఓ 20 సినిమాలకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. రెండు, మూడు సినిమాలు తప్ప మిగతావన్నీ చిన్న సినిమాలే. ఇప్పుడు ప్రభాస్‌తో చేసే సినిమా మ్యూజికల్‌గా విజయం సాధిస్తే విశాల్ చంద్రశేఖర్ కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడం ఖాయం.