English | Telugu

‘డెవిల్‌’ రిలీజ్‌కి ముందే నెక్స్‌ట్‌ సినిమాకు సన్నాహాలు!

కల్యాణ్‌రామ్‌ హీరోగా నవీన్‌ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్‌ నెలాఖరులో రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ భావిస్తున్నారని తెలిసింది. సినిమా రిలీజ్‌ విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. డిఫరెంట్‌ కథాంశంతో, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టరైజేషన్‌ ఇంతకుముందు అతని సినిమాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో డెఫినెట్‌గా హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో కళ్యాణ్‌రామ్‌ కృషి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత కల్యాణ్‌రామ్‌ చేయబోయే సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ చిత్ర దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ నెక్స్‌ట్‌ మూవీ ఉంటుందట. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ తర్వాత పలు వెబ్‌ సిరీస్‌లను రూపొందించిన పవన్‌ ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌ సినిమా కోసం బిగ్‌ స్క్రీన్‌వైపు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలని కొంతకాలం క్రితమే అనుకున్నారు. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయింది. దీనికి ఇప్పుడు టైమ్‌ కుదిరింది. ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత ‘బింబిసార2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.