English | Telugu
ప్రభాస్ తర్వాత శృతిహాసన్‌తో రొమాన్స్ చేసే హీరో ఎవరో తెలుసా?
Updated : Dec 14, 2023
సౌత్‌లో అందుబాటులో ఉన్న హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. అయితే ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో తన అందాలతో కనువిందు చేసిన శృతి ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఇటీవలే విడుదలైన హాయ్ నాన్న చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. అయితే ఆ క్యారెక్టర్ ఆమెకు ఎంతమాత్రం ప్లస్ అవ్వలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ప్రభాస్ ‘సలార్’పైనే పెట్టుకుంది. అయితే ఇది కూడా ఆమెకు ప్లస్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సలార్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే సలార్.. అంతే తప్ప ఈ సినిమా మరొకరికి ప్లస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. కాబట్టి శృతి ఈ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నా అవి అడియాసలే అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు.
ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్‌కి మరో బంపర్ ఆఫర్ వచ్చిందనే న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. కన్నడ స్టార్ హీరో యశ్ సరసన నటించే ఛాన్స్ శృతి కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. కెజిఎఫ్ 2 తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న యశ్ తాజాగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ‘టాక్సిక్’ పేరుతో రూపొందే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో యశ్ సరసన సాయిపల్లవి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతిహాసన్ పేరు కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ ఉంది. ఇప్పటికి సాయిపల్లవి, శృతిహాసన్ ఓకే అయ్యారు అనుకుంటే మరో హీరోయిన్‌కి అవకాశం ఉంది. ఆ ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా కన్‌ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అధికారికంగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.