English | Telugu
జైలర్ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
Updated : Oct 6, 2024
ఇటీవల 'దేవర'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేసే అవకాశముందని న్యూస్ రాగా.. తాజాగా మరో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.
తక్కువ సినిమాలతోనే కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా గతేడాది రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 'జైలర్-2' పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, నెల్సన్ చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చిందని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.