English | Telugu

మహేష్ సరసన ఇండోనేషియ‌న్ బ్యూటీ.. జక్కన్న ఏం ప్లాన్ చేశాడో!

మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉందని గతంలో పలువురి పేర్లు వినిపించాయి. అయితే రాజమౌళి అనూహ్యంగా మహేష్ సరసన నటించడానికి ఇండోనేషియ‌న్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు చెల్సియా ఇస్లాన్. 28 ఏళ్ళ చెల్సియా పలు ఇండోనేషియ‌న్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 'SSMB 29'లో నటించడం దాదాపు ఖాయమని, ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయిందని సమాచారం.

కాగా రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో సైతం ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటించడం విశేషం.