English | Telugu
క్రేజీ మల్టీస్టారర్.. రవితేజ అవుట్, దుల్కర్ ఇన్!
Updated : Jan 5, 2024
'జాంబీ రెడ్డి', 'అద్భుతం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న తేజ సజ్జా(Teja sajja).. త్వరలో 'హనుమాన్' (Hanuman) చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే తేజ సజ్జా తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ఆసక్తిని కలిగిస్తోంది.
రవితేజ (Raviteja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఈగల్'(Eagle) సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయనున్న సినిమాలో తేజ సజ్జా హీరో అని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ సైలెంట్ గా కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ (Manchu Manoj), ప్రత్యేక పాత్రలో రవితేజ కనువిందు చేయనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రవితేజ స్థానంలోకి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది.
'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ (Dulquer Salmaan). అలాగే 'లక్కీ భాస్కర్' అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు తేజ, మనోజ్ ల చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.