English | Telugu
ఆ హీరోతో నా పెళ్లి అనే వార్త చూసి షాక్ అయ్యాను!
Updated : Feb 8, 2024
సినిమా రంగంలో హీరో, హీరోయిన్ల మీద రూమర్స్ పుట్టుకు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నుంచి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని నిజమైతే, మరికొన్ని రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఒకప్పుడు ఈ రూమర్స్ అనేవి ప్రింట్ మీడియాకి మాత్రమే పరిమితమై ఉండేవి. క్షణాల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీడియా అపరిమితంగా విస్తరించింది. దీంతో ఏ చిన్న వార్త వచ్చినా దాన్ని వైరల్ చేస్తూ స్ప్రెడ్ చేసేస్తున్నారు నెటిజన్లు. అలాంటి ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన సినిమా ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. ఇదే కాకుండా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘స్టాండ్ అప్ రాహుల్’ వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే పర్టిక్యులర్‌గా బెల్లంకొండ గణేష్‌నే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గణేష్, వర్ష ఇద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాగా స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం వర్ష నటించిన ‘మా ఊరు భైరవకోన’ చిత్రం రిలీజ్‌కి సిద్ధమైంది. వచ్చేవారం ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న వర్ష దగ్గర ఈ రూమర్ ప్రస్తావన వచ్చింది.
దానికి వర్ష సమాధానమిస్తూ ‘ఒక సినిమాలో కలిసి నటించిన హీరో, హీరోయిన్ మధ్య సంబంధం అంట గట్టడం లేదా వారిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం జరుగుతుంటాయి. అసలు ఈ వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలీదు. నా విషయంలో మరీ దారుణంగా చెప్పుకుంటున్నారు. ‘గణేశ్‌తో నా పెళ్లి అనే వార్త చూసి నేను షాక్ అయ్యాను. ‘స్వాతిముత్యం’ సినిమా తర్వాత గణేష్‌ని నేను కలిసిందే లేదు. అలాంటప్పుడు ఇలాంటి వార్తలు ఎలా ప్ప్రెడ్ చేస్తున్నారో తెలీదు. అయితే ఇలాంటి వార్తలు రాకుండా అడ్డుకోవడం కష్టమైన పనేనని నా ఉద్దేశం’ అని సమాధానమిచ్చింది వర్ష.