English | Telugu
ఆఫర్లు లేకపోయినా.. ఆ విషయంలో తగ్గేదేలే!
Updated : Dec 9, 2023
ఒకప్పుడు హీరోయిన్లు దశాబ్దాలపాటు తమ కెరీర్‌ను కొనసాగించేవారు. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో అప్పటివరకు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నవారు వెనకపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం తమన్నా పరిస్థితి అలాగే ఉంది. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లు చేస్తోంది. అలాగే వీలున్నప్పుడు ఐటమ్ సాంగ్స్‌లో అందాలు ఆరబోస్తోంది. ఆమెకు ఆఫర్లు అనేవి రాకపోయినా తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించనని ఖరాఖండీగా చెబుతోందట. దీంతో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
సినిమాల్లో చిన్న క్యారెక్టర్ అయినా, హీరోయిన్‌గా అయినా, ఐటమ్ సాంగ్ చేసినా రూ.1కోటికి తగ్గను అంటోందట. దాని కంటే ఎమౌంట్ తగ్గితే డేట్స్ ఇచ్చేదేలేదు అని చెబుతోందట. మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా పారితోషికం విషయంలో తగ్గకున్నా కూడా ఆమెకి రెగ్యులర్ గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తన పరిస్థితి ఇలాగే కొనసాగుతుందనే భ్రమలో ఉన్న తమన్నాకి భవిష్యత్తులో డెఫినెట్‌గా చిన్న చితకా అవకాశాలు కూడా రావని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ విషయంలో కాస్త అటూ ఇటూగా ఆలోచిస్తుందా లేక తన పంథాలో వెళుతుందా అనేది చూడాలి.