Read more!

English | Telugu

‘హరిహర వీరమల్లు’ విషయంలో ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఎంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఏ సినిమా ఎంత వరకు వచ్చింది, పవన్‌కళ్యాణ్‌ అందుబాటులోకి రావాలంటే ఎంత టైమ్‌ పడుతుంది అనేది అంతు చిక్కని ప్రశ్నే. ఓజి, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీరమల్లు... చిత్రాలు ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ పూర్తి చేయాల్సి ఉంది. అందులో ‘హరిహర వీరమల్లు’ చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రకటించిన టైమ్‌లో హైప్‌ ఎంతో గొప్పగా వచ్చింది. ఆ తర్వాత రిలీజ్‌ అయిన టీజర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి. షూటింగ్‌ మాత్రం చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్‌ చేసింది కొంత మాత్రమేనని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మూడు పాటలు మాత్రమే రికార్డ్‌ చేశారు కీరవాణి. ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయనే విషయంలో కూడా కీరవాణికి క్లారిటీ లేదట. క్రిష్‌ అందుబాటులో లేకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. 

ఈ విషయంలో నిర్మాత ఎ.ఎం.రత్నం కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆమధ్య మీడియాతో మాట్లాడినపుడు ఎపి ఎలక్షన్స్‌ పూర్తి అయిన తర్వాత సినిమా రిలీజ్‌ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎపిలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం ‘హరిహర వీరమల్లు’ వచ్చే అవకాశమే లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే షూటింగ్‌ పార్ట్‌ చాలా బ్యాలెన్స్‌ ఉండటమే దానికి కారణం. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న సినిమాల్లో ‘ఓజి’కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారట. దీని తర్వాత ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లైన్‌లో ఉంది. ఈ సినిమా తర్వాతే ‘హరిహర వీరమల్లు’ గురించి ఆలోచిస్తారట. ఈ లెక్కన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావడానికి, రిలీజ్‌ అవ్వడానికి ఎంత టైమ్‌ పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిరది. ఒకవేళ పవన్‌ షూటింగ్‌కి రావాలన్నా ఆ గెటప్‌కి తగ్గట్టు హెయిర్‌ స్టైల్‌ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో జరిగే సూచలేవీ కనిపించడం లేదు. కాబట్టి ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని 2025లో ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చు అనేది స్పష్టమవుతోంది.