English | Telugu

పవన్ "గబ్బర్ సింగ్" కథ

పవన్ "గబ్బర్ సింగ్" కథ ఏమిటనేది అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హరిష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"గబ్బర్ సింగ్". హిందీలో వచ్చిన "దబాంగ్" సినిమా కథే ఈ చిత్రం కథ అన్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఈ "గబ్బర్ సింగ్" చిత్రంలో కొండవీడు ప్రజలకు హీరో సహాయం చేస్తూ తన పనులను కూడా చక్కబెట్టుకుంటాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

గతంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వేంకటేష్ లు హీరోలుగా నటించిన సినిమాల్లో కూడా కొండవీటి ప్రాంతం గురించిన కథలతో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ తో చూసుకుంటే "గబ్బర్ సింగ్" హిట్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అన్నట్టు ఈ "గబ్బర్ సింగ్ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు.