English | Telugu
శ్రీను వైట్లకి 12 కోట్ల బంపరాఫర్
Updated : Jan 4, 2012
శ్రీను వైట్లకి 12 కోట్ల బంపరాఫర్ తగిలిందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, బండ్ల గణేష్ "యాక్షన్" అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ "యాక్షన్" అనే చిత్రానికి "విత్ ఎంటర్ టైన్ మెంట్" అనే క్యాప్షన్ ని కూడా నిర్ణయించారు. అయితే ఈ "యాక్షన్" చిత్రం కనుక కలెక్షన్లు విషయంలో శీను వైట్ల గత చిత్రం "దూకుడు" రేంజ్ కి కానీ, దాని దరిదాపులకు గానీ వెళ్ళినట్లైతే అతనికి నిర్మాత పారితోషికం కాకుండా 12 కోట్లు అదనంగా ఇస్తానని అన్నాడని ఫిలిం నగర్ వాసులంటున్నారు.
ఇందులో నిజమెంతుందో కానీ ఆ మాటే నిర్మాత గణేష్ అని ఉంటే మాత్రం ఈ "యాక్షన్" సినిమా కచ్చితమైన హిట్టవటం మాత్రం ఖాయం. ఎందుకంటే ఛాలెంజ్ అంటే శీను వైట్లకి మహా ఇష్టం. అలాంటి ఛాలెంజెస్ ని అతను చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈ లెక్కన ఈ 12 కోట్లు శీను వైట్ల జేబులోకెళ్ళిపోయినట్లే.