English | Telugu

"బొబ్బిలి బ్రహ్మన్న" మీద ప్రభాస్ కన్ను

"బొబ్బిలి బ్రహ్మన్న" మీద ప్రభాస్ కన్నుపడిందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచరం. వివరాల్లోకి వెళితే 1984లో గోపీకృష్ణా మూవీస్ పతాకంపై, రెబెల్ స్టార్ కృష్ణం రాజు ద్విపాత్రాభినయం పోషించగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించబడిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "బొబ్బిలి బ్రహ్మన్న". ఈ "బొబ్బిలి బ్రహ్మన్న" చిత్రాన్ని రీమేక్ చేయాలని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆలోచిస్తున్నాడట.

కృష్ణం రాజు ఒక ముఖ్యపాత్రలో నటించే విధంగా, తాను హీరోగా నటిస్తూ ఈ "బొబ్బిలి బ్రహ్మన్న" చిత్రాన్ని రీమేక్ చేయాలని యంగ్ రెబెల్ స్టార్ ఆలోచిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడట. ఈ "బొబ్బిలి బ్రహ్మన్న" చిత్రం రీమేక్ కోసం రిలయన్స్ గ్రూప్ తో టై అప్ అయ్యే ఆలోచన కూడా ఉందట. అదే జరిగితే ఎవరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తీస్తారో ఇంకా తెలియదు. మళ్ళీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీస్తారా...? లేక ప్రస్తుతం ఉన్న దర్శకులతో తీస్తారా అన్న విషయం త్వరలోనే తెలుస్తుంది.