English | Telugu

దిల్‌రాజు దక్కించుకున్నాడా?

 

 

ఇంతకుముందు "బృందావనం" నిర్మించి తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్‌తో "రామయ్యా.. వస్తావయ్యా" చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌రాజు ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించే అవకాశం దక్కించుకున్నాడని తెలుస్తోంది. దాసరి దర్శకత్వంలో రూపొందిన "కళ్యాణ ప్రాప్తిరస్తు" చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన వక్కంతం వంశీకి ఆ చిత్రం తర్వాత హీరోగా కాదు కాదు.. చిన్నా చితకా క్యారెక్టర్స్ రోల్స్ కూడా రాలేదు. దాంతో మానసికంగా ఎంతో సంఘర్షణకు లోనైన వక్కంతం.. ఆ సంఘర్షణలోంచి రచయితగా మారాడు. అతను కథ అందించిన "కిక్" మంచి హిట్ అవ్వడంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. మరో రెండువారాల్లో మన ముందుకు రానున్న "ఎవడు" చిత్రానికి కూడా కథా రచయిత అతనే.

ఇటీవల కాలంలో దర్శకులుగా మారుతున్న రచయితలందరూ సూపర్‌ సక్సెలు సొంతం చేసుకుంటుండడంతో.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకారం తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ (ఎన్టీఆర్_వక్కంతం వంశీ) చిత్రాన్ని నిర్మించే అవకాశం దిల్‌రాజు సొంతమైయ్యిందని సమాచారం అందుతోంది. "రామయ్యా వస్తావయ్యా" అనంతరం "కందిరీగ" ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే "రభస"లో ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు కాస్త ముందు వెనకా వక్కంతం వంశీ చిత్రముంటుంది!