English | Telugu

పవర్‌స్టార్ పనిగట్టుకుని చేసాడా?

 

"ఎవడు" ఆడియో ఫంక్షన్‌కు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కావాలనే ఎగ్గొట్టాడా?" అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయ్. "అత్తారింటిది దారేది" షూటింగ్ నిమిత్తం పవన్‌కళ్యాణ్ విదేశంలో ఉన్నారని.. అందువల్లే "ఎవడు" ఆడియో ఫంక్షన్‌కు హాజరు కాలేకపోయారని అభిమానుల సమక్షంలో ప్రకటించిన కొద్ది గంటలకు పవన్‌కళ్యాణ్ హైద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. "పవన్‌కళ్యాణ్ రావాలనుకుంటె.. ఒకపూట ముందు రాలేకపోయి ఉండేవారా? లేక, పవన్‌కళ్యాణ్ వస్తానంటె.. ఒకరోజు ఆలశ్యంగా, అంటె సోమవారానికి బదులు మంగళవారం ఫంక్షన్ నిర్వహించి ఉండేవారు కాదా?" వంటి పలు అనుమానాలు మెగా అభిమానులను వేధిస్తున్నాయి.

 

పైగా పనిగట్టుకుని లీక్ చేస్తే తప్ప.. పవన్‌కళ్యాణ్ మంగళవారం మార్నింగ్‌కల్లా హైద్రాబాద్ చేరారన్న వాస్తవం బయటకి రాదు. పైగా ఆడియో ఫంక్షన్ రాత్రి పదిగంటలకు ముగిస్తే.. తెల్లారి పది గంటలకు పవన్‌కళ్యాణ్ నగర ప్రవేశం చేయడం, ఆ విషయం ఆగమేఘాలపై మీడియాకు చేరిపోవడం జరిగిపోయాయి. ఇవన్నీ పలు ప్రశ్నలను, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రామ్‌చరణ్ మీడియాను వెంట్రుక ముక్కతో సమానంగా సరిపోల్చి ఉండడంతో.. ఈ అంశం మరింత పెద్దదయ్యే అవకాశముంది. పైగా "ఎవడు" ఆడియో ఫంక్షన్‌కు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను ఇన్వైట్ చేయకపోవడం ద్వారా పుండు మీద కారం చల్లాడు రామ్‌చరణ్!