English | Telugu

"మాటలతో మాయ" చేస్తున్నాడా?

 

సిద్దార్ధ్‌తో సమంత సహజీవనం చేస్తోందో లేదో అసలు అతడ్ని ప్రేమిస్తుందో లేదో కూడా సరిగా తెలియదు కానీ.. తను నటిస్తున్న "అత్తారింటికి దారేది" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్‌తో మాత్రం ప్రేమలో పడిపోతోంది.

 

ఈ విషయాన్ని సమంత స్వయంగా పేర్కొంది. అంతేకాదు.. "అత్తారింటికి దారేది" చిత్రానికి "మాటలతో మాయ" అన్నది ట్యాగ్‌లైన్‌గా పెట్టాలని సజెస్ట్ చేస్తోంది. "అత్తారింటికి దారేది" చిత్రం కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ సమంతకు పిచ్చిపిచ్చిగా నచ్చేసాయి. "త్రివిక్రమ్ తన మాటలతో మాయ చేస్తున్నాడు" అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది సమంత. మాటలతో మాయ చేయడం త్రివిక్రమ్‌కు పెన్నుతో పెట్టిన విద్య మాత్రమే కాదు.. వెన్నతో పెట్టిన విద్య అని సమంతకు తెలిసినట్లు లేదు.

 

ఇంతకుముందు పార్వతిమెల్టర్‌ను కూడా తన మాటలతో మెల్ట్ చేసి.. చాలా కాలం ఆమెతో ఎఫైర్ నడిపి.. అమె కెరీర్‌ను పాడుచేసాడనే ఆరోపణలు త్రివిక్రమ్‌పై ఉన్నాయి. హీరోయిన్‌గా ఫుల్ డిమాండ్‌లో ఉండగా.. దాదాపు మూడేళ్లపాటు పార్వతి మెల్టన్ సినిమాలకు దూరంగా ఉండడం వెనుక త్రివిక్రమ్ మాటల మాయాజాలం ఉందని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

పాపం ఈ విషయం తెలియక త్రివిక్రమ్ మాటల మత్తులో అమాయకంగా పడిపోతోంది సమంత!