English | Telugu
ప్రాజెక్ట్ k యూనివర్స్.. తొమ్మిది సినిమాలు.. ఎందరో స్టార్లు!
Updated : Feb 20, 2024
ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని ఎప్పటినుంచో న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా తొమ్మిది భాగాలుగా రానుందనే వార్త సంచలనంగా మారింది.
హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమాల స్థాయిలో 'కల్కి' ఉంటుందని ముందునుంచి చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. హాలీవుడ్ లో మార్వెల్, డీసీ యూనివర్స్ ల తరహాలో.. 'కల్కి'ని ఇండియాస్ బిగ్గెస్ట్ యూనివర్స్ లా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ యూనివర్స్ నుంచి మొత్తం తొమ్మిది సినిమాలు రానున్నాయట.
'కల్కి' సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ఎందరో స్టార్స్ నటిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, రానా దగ్గుబాటి, రాజమౌళి తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ వంటి స్టార్స్ కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాదంట. యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల్లో ఎన్టీఆర్ తో పాటు ఇంకా ఎందరో స్టార్స్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారట. అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా పలువురు స్టార్స్ రంగంలోకి దిగే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే ఈ యూనివర్స్ తో టాలీవుడ్ పేరు.. గ్లోబల్ స్థాయిలో మోతమోగిపోతుంది అనడంలో సందేహం లేదు.