English | Telugu

చిరు 150 వ సినిమాని పూరీ వదిలేశాడా...?

చిరు 150 వ సినిమాని పూరీ వదిలేశాడా...? అంటే యస్...వదిలేశాడనే చెప్పాలి... వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం"బుడ్డా". ఈ చిత్రం విడుదల సందర్భంగా అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కి వచ్చారు. "బుడ్డా" చిత్రం ప్రీమియర్ షోకి మెగాస్టార్ చిరంజీవి, కృష్టం రాజు, రామ్ గోపాల వర్మ, రవితేజ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సందర్భంగా మెగాస్టార్ చిరు నటించబోయే ప్రతిష్టాత్మక 150 వ సినిమాకి తాను దర్శకత్వం వహిస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రెస్ మీట్ లో మాటన్నాడు.

కానీ ప్రస్తుతం అతనున్న పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా గురించి ఆలోచించే సమయం కూడా పూరీ జగన్నాథ్ కి ఉన్నట్టు కనిపించటం లేదు.మహేష్ బాబుతో "ది బిజినెస్ మ్యాన్", రవితేజతో "ఇడియట్-2" సినిమాలతో పాటు ఇటీవల జూనియర్ యన్ టి ఆర్ కి కూడా పూరీ జగన్నాథ్ ఒక కథ చెప్పారట. ఆ సినిమా కూడా ఒ.కె. అయ్యిందట. ఈ మూడు సినిమాలు పూర్తయ్యేందుకే యేడాదిన్నర లేదా రెండేళ్ళ సమయం పడుతుంది. ఇవికాక మరో రెండు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించటానికి కుడా పూరీ జగన్నాథ్ అంగీకరించాడని లోపాయికారీ సమాచారం. అప్పటికి రైతెవడో...రాజెవడో...