English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా వీరుపోట్ల చిత్రం

పవన్ ఎందుకు అన్నిస్క్రిప్ట్ లు వింటున్నాడు...? ఈ ప్రశ్న తెలుగు సినీ పరిశ్రమలో చాలా మందిని వేధిస్తూంది. వివరాల్లోకి వెళితే
ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దర్శక, రచయిత వీరు పోట్ల ఒక చక్కని కథను చెప్పాడట. ఆ కథ మెయిన్ పాయింట్
నచ్చటంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పారట పవన్ కళ్యాణ్. ఇప్పటికే పవన్ కళ్యాణ్  "ది షాడో"( "కాళీ" ) చిత్రంలో  నటిస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మించబోయే "గబ్బర్ సింగ్" చిత్రంలో నటిస్తారు

 

 

ఈ రెండు చిత్రల్తో పాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వమలో,కాంగ్రెస్ పి.సి.సి.చీఫ్ బొత్స సత్యనారాయణ జీవిత చరిత్ర ఆధారంగా, గణేష్ నిర్మించబోయే చిత్రంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారట. ఈ మూడు సినిమాలూ పూర్తవ్వాలంటే కనీసం మూడేళ్ళ సమయం పడుతుంది. మరివీరూ పోట్ల దర్శకత్వంలోని సినిమాలో ఎప్పుడు నటిస్తాడు....? అయినా ఇలా అనేక కథలు అదేనమడీ స్క్రిప్ట్ లు వింటున్నారు పవన్ కళ్యాణ్...పవన్ ఎందుకు అన్నిస్క్రిప్ట్ లు వింటున్నాడు...? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకటం లేదు.