English | Telugu
"గబ్బర్ సింగ్" లో చిరు డ్యాన్స్
Updated : Feb 6, 2012
"గబ్బర్ సింగ్" లో చిరు డ్యాన్స్ చేయనున్నారట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం "గబ్బర్ సింగ్". హిందీ "దబాంగ్" సినిమాకిది రీమేక్ అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఆ చిత్రంలో బాగా ప్రసిద్ధిపొందిన "మున్నీ బద్నాం హుయీ డారిలింగ్ తేరేలియే" అనే పాటను తెలుగులో తీస్తున్నారు.
ఆ పాటలో కనిపించమని మెగాస్టార్ చిరంజీవిని అడిగారట దర్శకుడు హరీష్ శంకర్. అందుకాయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. గతంలో "శంకర్ దాదా జిందాబాద్" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాసేపు కనిపిస్తారు. దానికి ప్రతిగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని పాటలో కనిపించనున్నారట. "మగధీర" చిత్రంలో కూడా రామ్ చరణ్ తో కలసి చిరంజీవి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.