English | Telugu
ఇలియానాతో అల్లు అర్జున్ లిప్ లాక్
Updated : Feb 7, 2012
ఇలియానాతో అల్లు అర్జున్ లిప్ లాక్ సీన్లో నటించనున్నాడు. వివరాల్లోకి వెళితే మన యువ హీరోల్లో స్టైలిష్ స్టార్ గా పేరుపడ్డ అల్లు అర్జున్ లిప్ లాక్ సీన్లకు కూడా బాగా పేరుగడించాడు. గతంలో వరుడు చిత్రంలో భాను మెహరాతో, ఆర్య-2 చిత్రంలో కాజల్ అగర్వాల్ తో, వేదం చిత్రంలో దీక్షా సేథ్ తోనూ ఇలా లిప్ లాక్ సీన్లలో నటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇలియానాతో లిప్ లాక్ సీనుందట. "బద్రీనాథ్" చిత్రంలో మిల్కీవైట్ బ్యూటీ తమన్నా మాత్రం ఈ లిప్ లాక్ సీన్ కి "నో" చెప్పిందట. లేకపోతే అల్లు అర్జున్ లిప్ లాక్ ముద్దులు పెట్టిన హీరోయిన్లలో ఇలియానా నంబర్ అయిదయ్యేది. ప్రస్తుతం నాలుగయ్యింది.