English | Telugu

శృతి హాసన్ చైన్ స్మోకరట

శృతి హాసన్ చైన్ స్మోకరట. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించతగ్గ నటుడు, సకలకళావల్లభుడు, పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్. శృతి హాసన్ స్వతహాగా సంగీత దర్శకురాలు, గాయని, హీరోయిన్ గా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూంది. ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "గబ్బర్ సింగ్" సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూంది.

అయితే ఆ సినిమా షూటింగ్ విరామ సమయంలో ఎప్పుడు చూసినా శృతి హాసన్ చేతిలో సిగిరెట్ తోనే కనిపిస్తూందట. షాట్ గ్యాప్ ఉంటే చాలు సిగిరేట్ అంటిస్తుందని ఈ చిత్రం యూనిట్ సభ్యులంటున్నారు. సిగిరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యురియస్ టు హెల్త్ అన్న విషయం తెలిసీ ఆ పాడు సిగిరెట్లు ఎలా తాగుతారో కదా...!