English | Telugu

బాలకృష్ణతో పాన్ ఇండియా బ్యూటీ..  సాలిడ్ స్కెచ్ వేశారుగా!

 

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వరుస విజయాలతో మాంచి జోష్ లో ఉన్నారు. 2021లో 'అఖండ', 2023 సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ సీనియర్ స్టార్.. ప్రస్తుతం 'భగవంత్ కేసరి' సినిమాలో నటిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు బాలయ్య. ఇందులో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తుండగా.. శ్రీలీల ఓ ముఖ్య పాత్రలో అలరించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ థియేటర్స్ లోకి రానుంది.

ఇదిలా ఉంటే, యువ దర్శకుడు బాబీ కాంబినేషన్ లో బాలయ్య ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో కథానాయికగా 'కేజీఎఫ్' భామ శ్రీనిధి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనుక నిజమైతే.. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు దక్కించుకున్న శ్రీనిధికి.. ఈ అవకాశం అపురూపమేనని చెప్పొచ్చు. త్వరలోనే బాలయ్య, శ్రీనిధి కాంబోపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.