English | Telugu

డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మెగాస్టార్

డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మెగాస్టార్ అని తెలిసింది. మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి తన 150 వ చిత్రం కోసం మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారట. గతంలో తన హిట్ సాంగ్స్ అన్నింటికీ ఆయన డ్యాన్స్ చేస్తున్నారట. ఆ మధ్య ఆయన కేరళ వెళ్ళి ఆయుర్వేద వైద్యం ద్వారా బరువు తగ్గించుకున్న సంగతి తెలిసిందే.

"దాయి దాయి దామ్మ..కురిసే కుందనాల బొమ్మ" అనే పాటకు ఆయన డ్యాన్స్ చేయటం అనుకోకుండా చూసిన వ్యక్తి చిరంజీవి గారి డ్యాన్సులో ఈ వయసులో కూడా ఆ గ్రేస్, ఆ స్టైల్, ఆ స్పీడ్ అలాగే ఉన్నాయనీ, అలా డ్యాన్స్ చేయగలగటం ఒక్క చిరంజీవి గారికే సాధ్యం అనీ అన్నారు. ఒక పక్క రాజకీయాలు, ఒక పక్క సినిమాలు ఆయన ఎలా మెయిటైన్ చేస్తారో చూడాలి.