English | Telugu
మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్
Updated : Feb 7, 2012
మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే "రచ్చ" సినిమాలో టైటిల్ సాంగ్ లో "హి ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ రచ్చ" అని ఉంది. ఆ "మిస్టర్ తీస్ మార్ ఖాన్" అనే దాన్నే రామ్ చరణ్ కొత్త సినిమాకి పేరుగా పెడితే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నారట.
యూనివర్సల్ మీడియా పతాకంపై, రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్, కన్నడ హీరోయిన్ పరుల్ యాదవ్ హీరోయిన్లుగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.,వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రికరిస్తున్నారు. ఈ చిత్రానికి "మిస్టర్ తీస్ మార్ ఖాన్" అన్న పేరుని పేట్టే ఆలోచనలో ఈ చిత్రం యూనిట్ ఉందని సమాచారం.